నాగచైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న సినిమా ‘లవ్ స్టోరీ’. ప్రస్తుతం ఈ సినిమా విడుదల పై అనేక వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ 10న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. కానీ, అదే సమయంలో నాని టక్ జగదీష్‌ సినిమా ఓటీటీ లో రిలీజ్ అవుతున్నట్లు వార్తలు వచ్చాయి. పండగ సమయంలో ఓటీటీ లో సినిమా ఎలా రిలీజ్ చేస్తారు అంటూ సినీ పరిశ్రమలో చాలా గొడవలు జరిగాయి. దీంతో లవ్ స్టోరీ సినిమా మళ్ళీ వాయిదా పడింది.

ఇదిలా ఉంటే చాలామంది నెటిజన్లు సినిమా వాయిదాకు చిత్రబృందం విడుదల చేసిన పోస్టరే కారణమంటున్నారు. మూవీ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ లో ఒక స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. వారు విడుదల చేసిన పోస్టర్ లో వినాయక చవితి (V-i-n-a-k-a-y-a) స్పెల్లింగ్ తప్పుగా రాశారు. దాని తర్వాత వెంటనే మూవీ మేకర్స్ స్పెల్లింగ్ ను కరెక్ట్ చేసి మళ్ళీ పోస్టర్ ను విడుదల చేశారు. కానీ అప్పటికే చాలా మంది నెటిజన్లు ఆ పోస్టర్ ను చూశారు.

చిత్ర పరిశ్రమ చాలా సెంటిమెంట్ లను నమ్మడం వల్ల పోస్టర్ విడుదలైన రోజు నుండి దీనిని ఒక అపశకునంగా భావిస్తున్నారు. స్వామి వినాయకుని పేరు తప్పుగా రాయడం వల్లే సినిమా వాయిదా పడుతుందని కొందరు అంటున్నారు. మరోపక్క నెటిజన్లు కూడా సినిమా వాయిదా విషయం ను ఆ స్పెల్లింగ్ మిస్టేక్ కు లింక్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మూవీ మేకర్స్ కొత్త విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు..

x