చెన్నై అంతర్జాతీయ పోస్ట్ ఆఫీస్ లో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. ఆ అంతర్జాతీయ పోస్ట్ ఆఫీస్ లో భారీగా సాలెపురుగు లను పట్టుకున్నారు. కేటుగాళ్లు ప్రాణంతో ఉన్న 107 సాలెపురుగులను పార్సిల్ చేసి పోలాండ్ నుంచి చెన్నై కి ఎక్స్పోర్ట్ చేశారు. చెన్నై పోస్ట్ ఆఫీస్ లో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయడంతో ఈ సాలెపురుగుల అక్రమ రవాణా బయటపడింది. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి చిరునామాకు ఈ సాలెపురుగులను తరలిస్తున్నట్లు సమాచారం. కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

x