కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ జంటగా నటించిన ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’ సినిమా ఆగస్టు 6న థియేటర్లలో విడుదల కానుంది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ ప్రకటించారు. మహమ్మారి కరోనా వల్ల కొంతమంది ప్రముఖ నిర్మాతలు ప్రత్యక్ష OTT విడుదలను ఎంచుకున్నారు. కానీ, ఈ సినిమా నిర్మాతలు ఓటీటీలో విడుదల చేయకుండా థియేటర్లలోనే విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు. వారు అన్నమాట ప్రకారమే ఈ సినిమాను ఆగస్ట్ 6న థియేటర్లలో విడుదల చేస్తున్నారు.
నివేదికల ప్రకారం, ఎస్. ఆర్. కళ్యాణ మండపం సినిమా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో అద్భుతమైన వ్యాపారం చేసింది. ఈ సినిమాలోని పాటలు మరియు టీజర్ యొక్క క్రేజ్ కారణంగా థియేట్రికల్ హక్కులు మాత్రమే సుమారు 4.5 కోట్ల పొందింది.
హీరో కిరణ్ అబ్బవరానికి ఇది రెండవ చిత్రం. ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది. శ్రీధర్ గాడే ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రమోద్ మరియు రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఈ సినిమాలో సాయి కుమార్, తనికెళ్ల భరణి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.