కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా సినిమా థియేటర్లు మూసివేయపడ్డాయి. దీనితో తక్కువ బడ్జెట్ కలిగిన తెలుగు సినిమాలు డిజిటల్ ప్లాట్ ఫామ్ విడుదలకు వెళ్తున్నాయి. అయితే, కిరణ్ అబ్బావరం, ప్రియాంక జవాల్కర్ కలిసి నటించిన సినిమా ఎస్ఆర్ కళ్యాణమండపం, ఈ చిత్ర నిర్మాతలు ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకున్నారు.

వారు OTT ప్లాట్‌ ఫామ్ నుండి వచ్చిన కొన్ని లాభదాయకమైన ఒప్పందాలను తిరస్కరించారు మరియు థియేట్రికల్ విడుదలకు కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ చిత్రం థియేటర్లలో మాత్రమే విడుదల అవుతుందని ధృవీకరిస్తూ మేకర్స్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.

ఎస్.ఆర్.కల్యాణమండపం సినిమాను శ్రీధర్ గాదె దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ప్రమోద్ మరియు రాజు నిర్మించారు. ఇందులో హీరోయిన్ గా ప్రియాంక జవాల్కర్ నటించారు.

x