స్టార్ హీరోతో సినిమా చేస్తే కెరియర్ ఓ రేంజ్ లో ఉంటుందని అందరు భావిస్తారు. అదే స్టార్ హీరో సినిమాకి నో చెబితే లేనిపోని సమస్యలు వస్తాయి. ఇక అందరు ఆ హీరోయిన్ కటింగ్ కొడుతుందని నెగిటివ్ కామెంట్స్ చేస్తారు. ఈ నెగిటివిటీ తో కెరియర్ కు బ్రేకులు పడే అవకాశం ఉంది. ఇలా ఓ హీరోయిన్ చాలా తెలివిగా సూపర్ స్టార్ సినిమాకి నో చెప్పిందనే ప్రచారం జరుగుతోంది. పెళ్లి సందడి మూవీ హీరోయిన్

మహేష్ బాబు తో సినిమా చేసే అవకాశం వస్తే, ఏ హీరోయిన్ అయినా ఓకే చెబుతుంది. సూపర్ స్టార్ తో సినిమా చేస్తే కెరీర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని మరో ఆలోచన లేకుండా హీరోయిన్స్ తమ కాల్ షీట్స్ ఇస్తూ ఉంటారు. కానీ, శ్రీలీల మాత్రం ఇన్ డైరెక్ట్ గా నో చెప్పిందని ప్రచారం జరుగుతుంది. మహేష్ బాబు సినిమాకి నో చెప్పటానికి రెమ్యునరేషన్ అనే అస్త్రాన్ని వాడుకుందని వార్తలు వస్తున్నాయి.

మహేష్ బాబు ఇటీవలే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా మొదలు పెట్టాడు. ఏప్రిల్ నుంచి ఈ ప్రాజెక్టు రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. ఇక ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ రోల్ కోసం మూవీ మేకర్స్ శ్రీలీల ను సంప్రదించారు. కానీ, ఈ బ్యూటీ కోటి రూపాయల రెమ్యూనరేషన్ అయితేనే చేస్తాను అని చెప్పింది.

‘పెళ్లి సందD’ అనే ఒకే ఒక సినిమా చేసిన ఈ హీరోయిన్ ఇంత డిమాండ్ చేయటం ఏమిటని మేకర్స్ ఆశ్చర్యపోయరు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా లో జనరల్ గా ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. కానీ, మెయిన్ హీరోయిన్ కు ఉన్న ప్రాధాన్యత సెకండ్ హీరోయిన్ కు ఉండడు. “అరవింద సమేత” లో ఈషా రెబ్బా, అలా వైకుంఠపురం లో నివేద పెత్తురాజ్, ఇలా సెకండ్ హీరోయిన్ రోల్స్ చేసిన వాళ్లంతా జనాలకి సపోర్టింగ్ క్యారెక్టర్స్ గానే కనిపించారు.

మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాలో కూడా సెకండ్ హీరోయిన్ రోల్ ఇలాగే సపోర్టింగ్ క్యారెక్టర్ లాగా ఉంటుందని, అందుకే ఈ ఆఫర్ కి డైరెక్ట్ గా ‘నో’ చెప్పలేక కోటి రూపాయల రెమ్యూనరేషన్ అడిగి మేకర్స్ ను ఆలోచనలో పడేసిందని సినీ జనాలు అంటున్నారు. అయితే రవితేజ ధమాకా సినిమాకు కూడా ఈ హీరోయిన్ కోటి రూపాయలు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

x