కె.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్ లో ఒక దొంగతనం కేసు నమోదు అయింది. కె.పి.హెచ్.బి కాలనీ లోఉన్న శ్రీ కాశీ విశ్వనాథ స్వామి గుడిలో దొంగలు పడ్డారు. పూజారి గారు నిన్న రాత్రి ఆలయం తలుపులు మూసి తాళం వేసి తన ఇంటికి వెళ్లారు. ఉదయం గుడికి వచ్చిన పూజారి తలుపులు తెరిచి ఉండటం గమనించి అక్కడ ఉన్న స్థానికులతో కలిసి పోలీసులకు పిర్యాదు చేశాడు.

సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు అక్కడ జరిగిన దొంగతనం గురించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఆలయ పరిధిలో మొత్తం మూడు గుళ్ళ ఉన్నాయి, మొత్తం మీద పదకొండు కిలోల వెండి ఆభరణాలుమరియు స్వామి వారి కిరీటం, వస్తువులు దొంగలు తీసుకు వెళ్లారని ఆలయ పూజారి తెలిపారు. ఆలయంలో సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి, కానీ దుండగులు ఆ సీసీ కెమెరా యొక్క వైర్లు కట్ చేసి ఆలయంలోకి ప్రవేశించారని పోలీసులు చెప్పారు. తొందర్లోనే దొంగలను అదుపులోకి తీసుకుంటామని డిఎస్సై శ్యాంబాబు తెలిపారు.

 

x