సుధీర్ బాబు నుంచి తాజాగా రాబోతున్న సినిమా “శ్రీదేవి సోడా సెంటర్”. ‘పలాస 1978’ ఫేమ్ దర్శకుడు కరుణ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ‘జాంబి రెడ్డి’ తరువాత ఆనంది ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఆగష్టు 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ ఈ సినిమా నుంచి మరో లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు.

‘చుక్కల మేళం.. దిక్కుల తాళం.. ఒక్కటయే ఈ సంబరం..’ అంటూ సాగే ఈ పాట తాజాగా విడుదల అయ్యింది. ఈ సినిమాను 70mm ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా – దేవిరెడ్డి శశి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘భలే మంచి రోజు’ సినిమా తరువాత నిర్మాతలు సుధీర్ బాబుతో చేస్తున్న రెండో సినిమా ఇది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఒక అందమైన ప్రేమ కథ ఈ సినిమా.

x