పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం లో యంగ్ హీరో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా ‘శ్రీదేవి సోడా సెంటర్’. ఇప్పటికే విడుదలైనా టీజర్, పోస్టర్స్ మరియు పాటలు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేలా కనిపిస్తున్నాయి.

మూవీ మేకర్స్ ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను మహేష్ బాబు చేతుల మీదగా ఆగష్టు 19న ఉదయం 10 గంటలకు విడుదల చేయబోతున్నారు. తాజాగా ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. 70mm ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ మూవీని విజయ్ చిల్లా – దేవిరెడ్డి శశి సంయుక్తంగా నిర్మస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఆగష్టు 27న ప్రేక్షుకుల ముందుకు రాబోతుంది.

x