శర్వానంద్ శ్రీకారమ్ ఇటీవలే సన్ నెట్‌వర్క్ యొక్క OTT ప్లాట్‌ఫామ్ అయినా సన్ నెక్స్ట్ లో విడుదల అయ్యింది. నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా ఈ మూవీ టీమ్ కి వారు చేసిన ఎఫ్ర్ట్కి అభినందనలు తెలియచేస్తున్నారు. ఇంకా, ఈ చిత్రం OTT లో విజయవంతంగా కొనసాగుతుంది.

“ఇది మా ప్లాట్‌ఫామ్‌లో ఇటీవలి కాలంలో అత్యధికంగా వ్యూస్ వచ్చిన తెలుగు చిత్రం. రాబోయే వారాల్లో కూడా ఈ చిత్రం బాగా రాణిస్తుందని మేము ఆశిస్తున్నాము ” అని సన్ NXT కంటెంట్ హెడ్ (సౌత్) అన్నారు. మూవీ మేకర్స్ తమకు వస్తున్న స్పందన పట్ల ఆనందంగా ఉన్నారు.

వాణిజ్యపరమైన అంశాల కోసం తప్పుకోకుండా కొత్తగా వచ్చిన కిషోర్ చేత శ్రీకారం మూవీ నిజాయితీగా తెరకెక్కింది. శర్వానంద్ ఆకర్షణీయమైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు.

x