టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోల్లో ప్రత్యేకంగా శర్వానంద్ కు ఒక మంచి గుర్తింపు ఉంది, అతని దగ్గర నుండి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అంతేకాదు శర్వానంద్ సినిమాలు థియేటర్స్ వద్ద మంచి కలెక్షన్స్ వసూలు చేస్తాయి. ఆయన తాజా చిత్రం శ్రీకారం గత నెల శివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదల అయిన ఒక నెల తర్వాత ఈ చిత్రాన్ని ఇప్పుడు ఓటిటి ప్లాట్ ఫామ్ సన్ నెక్స్ట్ లో ప్రదర్శించబడుతుంది. సన్ నెక్స్ట్ ఈ సినిమా యొక్క శాటిలైట్ రైట్స్ మరియు డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది.

శ్రీకారం సినిమా అనేది ఒక మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా. ఈ సినిమా రైతుల ప్రస్తుత పరిస్థితిని మరియు వ్యవసాయాన్ని ఎందుకు తీవ్రంగా పరిగణించాలో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు వసూలు చేసింది.

మరో వైపు, ఇటీవల విడుదలైన తెల్లవారితే గురువారం ఈ సినిమా కూడా ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన ఆహా లో ప్రసారం అవుతుంది. సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి కుమారుడు శ్రీ సింహ నుంచి 2019లో కామెడీ థిల్లర్ గా తెరకెక్కిన “మత్తు వదలరా” అనే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల ఆయన రెండవ చిత్రం “తెల్లవారితే గురువారం” ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలై మూడు వారాల్లోనే ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన ఆహా లో రిలీజ్ అయింది.

తెల్లవారితే గురువారం స్టోరీ ఏమిటంటే పెళ్లికి ముందు రోజు రాత్రి కళ్యాణ మండపం నుండి పారిపోయిన వధూవరుల కథ. పారిపోవటానికి వారికి సొంత కారణాలున్నాయి అక్కడ నుండి సినిమా ఎలా పురోగమిస్తుందో ప్రధాన కథాంశం. మిష నారంగ్ మరియు చిత్ర శుక్ల ఈ సినిమాలో హీరోయిన్స్ గా యాక్ట్ చేశారు.

x