పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, శృతిహాస‌న్ హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘సాలార్’. ఈ సినిమా పై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి. మూవీ యూనిట్ ప్రస్తుతం ముంబై లో నాలుగో షెడ్యూల్ షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ లో పాల్గొనేందుకు శృతిహాస‌న్‌ ముంబై కు చేరుకుంది.

శృతిహాస‌న్‌ సాలార్ సెట్స్ లోకి రాగానే డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ తో కలిసి ఒక చిన్న వీడియో క్లిప్ ను తీసి తన ట్విట‌ర్ ప్రొఫైల్ లో పోస్ట్ చేసింది. నా అభిమాన డైరెక్ట‌ర్లలో ఒక‌రైన ప్ర‌శాంత్ నీల్ సార్ ను బాధిస్తూ..అంటూ శృతిహాస‌న్‌ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆ వీడియో లో శృతిహాస‌న్ పక్కన ప్రశాంత్ నీల్‌ మైక్ పట్టుకొని నవ్వుతు కనిపించారు. మూవీ మేకర్స్ గత నెల హైదరాబాద్‌లో సుమారు 10 రోజుల‌పాటు సుదీర్ఘ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. మిగిలిన షెడ్యూల్ ను శ‌ర‌వేగంగా జరుపుకుంటున్నారు. ఈ సినిమా 2022 ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. విజ‌య్ కిరగందూర్ హోంబ‌లే ఫిలిమ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

x