కృతి సనన్ నటించిన ‘మిమి’ చిత్రం ఇటీవల OTT లో విడుదలై సూపర్ హిట్ అయింది. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ప్యాన్‌ ఇండియన్‌ స్టార్‌ ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటానని కృతీ సనన్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

ప్రభాస్‌, టైగర్‌ ష్రాఫ్‌, కార్తీక్‌ ఆర్యన్‌ ఈ ముగ్గురు హీరోల్లో మీరు ఎవర్ని పెళ్లి చేసుకుంటారు..? ఎవరితో డేట్‌కు వెళతారు..? మరియు ఎవర్ని ఫ్లర్ట్‌ చేస్తారు..? అనే ప్రశ్నలకు కృతీ సనన్‌, కార్తీక్‌ ఆర్యన్‌ను ఫ్లర్ట్‌ చేస్తానని, టైగర్‌ ష్రాఫ్‌తో డేటింగ్ చేస్తానని, ప్రభాస్‌ను వివాహం చేసుకుంటానని సమాధానం ఇచ్చారు.

ప్రస్తుతం కృతీ సనన్‌ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ కు జోడిగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు 80 శాతం పూర్తీ అయింది. ఇంకా 30 రోజుల షూటింగ్ లో ఈ సినిమాను కంప్లీట్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సినిమా షూటింగ్ తొందరగా పూర్తయిన, గ్రాఫిక్స్ వర్క్స్ కు మాత్రం చాలా సమయం పడుతుంది. మూవీ మేకర్స్ ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

x