రాజేంద్రనగర్ అత్తాపూర్ లో పీవీఎన్ఆర్ హైవేపై కారులో మంటలు చెలరేగాయి. కారు ఇంజన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కారు నడుపుతున్న మహిళ కారును పక్కన నిలిపివేసింది. కారులో నుంచి బయటకు రావటానికి ప్రయత్నించగా కారు డోర్లు లాక్ అయ్యాయి. ఆ కారులో మహిళల తో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. మహేశ్వరం నుండి హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

కారు డోర్లు రాకపోవడంతో బయటకు రావటానికి ఆమె అనేక రకాలుగా ప్రయత్నాలు చేసింది. కానీ, ఎలాంటి ప్రయోజనం లేదు. ఇంతలో ఆ మంటలను చూసి రవి అనే వ్యక్తి కారు వద్దకు పరుగులు తీశాడు. అతను ప్రాణాలకు తెగించి కార్లో ఉన్న తల్లిని మరియు ముగ్గురు పిల్లలను రక్షించాడు. క్షణాల్లో కారు పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

image source

x