యంగ్ హీరో సుధీర్ బాబు చివరిగా హీరో నాని తో కలిసి “వి” అనే చిత్రం చేశారు. ఆ సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో విడుదల అయ్యింది. ప్రస్తుతం సుధీర్ బాబు నటించిన “శ్రీదేవి సోడా సెంటర్” అనే సినిమా విడుదలకు సిద్దమవుతుంది. ఆయన ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” అనే సినిమాలో నటించబోతున్నారు. ఈ రెండు సినిమాలే కాకుండా సుధీర్ బాబు మరో చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమాకు ప్రముఖ నటుడు మరియు రచయిత హర్ష వర్ధన్ దర్శకత్వం వహించబోతున్నారు.

హర్ష వర్ధన్ గతంలో రెండు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి బ్యానర్ క్రింద నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. ఈ చిత్రం పక్క ఫామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది. ఈ సినిమా యొక్క రెగ్యులర్ షూట్ వచ్చే నెల నుండి మొదలుకానుంది.

 

x