ఈ రోజు సుధీర్ బాబు పుట్టినరోజు సందర్బంగా, ఆయన నుంచి రాబోతున్న “శ్రీదేవి సోడా సెంటర్” సినిమా నుంచి టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

టీజర్ చూస్తుంటే ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంతో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కినట్లు కనిపిస్తుంది. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నట్లు ఉన్నాయి, సినిమాటోగ్రఫీ అదే విధంగా కనిపిస్తుంది. మణి శర్మ యొక్క నేపథ్య సంగీతం అద్భుతంగా ఉండనుంది.

పుట్టినరోజు సందర్బంగా విడుదల అయిన టీజర్ లో సుధీర్ బాబు అద్భుతంగా కనిపించాడు. అతని పాత్రకు సూరి బాబు అని పేరు పెట్టారు మరియు అతను ఈ చాలెంజింగ్ పాత్రకు తగినట్లుగా కనిపిస్తాడు.

పలాసా 1978 ఫేమ్ కరుణ కుమార్ ఈ సినిమా అయినా శ్రీదేవి సోడా సెంటర్కు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ను 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నారు.

x