ఇటీవల హీరో కార్తీక్ నుంచి వచ్చిన సినిమా సుల్తాన్‌. రష్మిక ఈ సినిమా లో హీరోయిన్ గా నటించారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం అంచనాలకు తగ్గట్టుగా ఆడలేకపోయింది. రష్మీకా సుల్తాన్ సినిమాతో కోలీవుడ్‌లో తొలిసారిగా అడుగు పెట్టారు. ఇప్పుడు ఈ చిత్రం ఆన్‌లైన్‌లో రెండు ఫ్లాట్ ఫామ్ లో విడుదలకు సిద్ధమవుతోంది. చిత్రం యొక్క తమిళ వెర్షన్, డిస్నీ + హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతుందని మరియు చిత్రం యొక్క తెలుగు వెర్షన్ ఆహా లో ప్రసారం అవుతుంది.

ఇంతకు ముందు, కార్తీ యొక్క ఖైదీ సినిమా కూడా ఇలాగే రెండు-ఫ్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఈ చిత్రం యొక్క తమిళ వెర్షన్ అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాగా, ఈ చిత్రం తెలుగు వెర్షన్ ఆహా లో విడుదలైంది. సినిమా యొక్క ప్రత్యేకమైన తెలుగు స్ట్రీమింగ్ హక్కుల కోసం ఆహా మేకర్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మే 2 న హాట్స్టార్ మరియు ఆహా రెండింటిలో విడుదల అవుతుంది.

బక్కియరాజ్ కన్నన్ ఈ చిత్రానికి రచయిత మరియు దర్శకుడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రభు మరియు ఎస్ఆర్ ప్రకాష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. యువన్ శంకర్ రాజా ఈ చిత్ర సంగీతాన్ని అందించారు.

x