తమిళ్ హీరో కార్తీక్ చాలా సినిమాలు తెలుగులోకూడా వచ్చాయి. ఆ సినిమాలను ప్రేక్షకులు చాలా వరకు ఆదరించారు. ఇప్పుడు ఆయన నుంచి సుల్తాన్ సినిమా రాబోతుంది. ఈ సినిమా ను యాక్షన్ థ్రిల్లర్ గా డైరెక్టర్ తెరకెక్కించారు. ఈ సినిమాలో కార్తీక్ సరసన రష్మిక మండన హీరోయిన్ గా చేస్తోంది. రష్మికా కు ఇది మొదటి తమిళ్ సినిమా. ఈ సినిమా విడుదలకు ముందు ప్రమోషన్ భారీ ఎత్తున చేశారు. ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందో లేదో తెలుసుకుందాం.
కథాకథనం:
గ్రామాన్ని నాశనం చేయాలనుకునే వ్యక్తుల నుంచి గ్రామాన్ని కాపాడిన ఓ యువకుడి కథ. ఆ వ్యక్తులను ఒంటరిగా ఎలా ఎదుర్కొన్నాడు, ఈ క్రమంలో హీరోకి వచ్చిన సమస్య లు ఏమిటి? వాటి నుంచి హీరో ఎలా బయటపడ్డాడు? వీటి మధ్యలో ప్రేమ కథ ఏమైంది? అసలు ఊరికి వచ్చిన కష్టం ఏమిటి అన్నదే ఈ సుల్తాన్ చిత్రం.
విశ్లేషణ:
సినిమా విశ్లేషణ విషయానికొస్తే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో ఒక గ్రామంలో జరిగే సంఘటనలతో సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత ప్రస్తుతం జరిగే కథ లోకి వస్తుంది. సుల్తాన్ జీవితం సరదాగా సాగిపోయే సీన్లు ఆకట్టుకుంటాయి. తండ్రికి కొడుకు కి మధ్యలో వచ్చే సంభాషణలు అలరిస్తాయి. సుల్తాన్ కు ఒక చాలెంజ్ రావడం తో సినిమా మరొకచోటకి షిఫ్ట్ అవ్వటం వంటి సన్నివేశాలు చక్కగా సాగిపోతాయి. ఇక హీరో, హీరోయిన్ ని చూసి ప్రేమలో పడటం, ఆమ్ ప్రేమను వ్యతిరేకించడం వంటివి ఆకట్టుకుంటాయి.
ఆ తర్వాత ఫ్రీ ఇంటర్వెల్ ముందు అసలు కథ మొదలవుతుంది. గ్రామంలో విలన్ తో గొడవ అనంతరం తను ఆ గ్రామం లో హీరో అవుతాడు. ఇంటర్వెల్ ముందు ఒక ఆసక్తికర ట్విస్ట్ ఉంటుంది.సినిమా మెల్లిగా సాగిపోతూ ఉంటుంది. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను చాలా సినిమాల్లో చూసినట్టుగా అనిపించిన వాటికి న్యూ క్రియేషన్స్ యాడ్ చేయటంతో మంచి ఫీల్ అనిపిస్తుంది. హీరో కార్తీక్ మరియు రష్మిక మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది.
ఇంటర్వెల్ తర్వాత సినిమా మొత్తం ఎమోషనల్ గా సాగుతుంది. విలన్ చేసే వాటిపై సుల్తాన్ పోరాడటం. ఈ క్రమంలో గ్రామం లో ఎదురయ్యే సమస్యలపై పోరాడటం. మధ్యలో వచ్చే లవ్ సీన్స్ అందరిని ఆకట్టుకుంటాయి. అయితే హీరో విలన్ ల మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి.
నటీనటులు:
హీరో కార్తీక్ తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తారు. తనదైన యాక్టింగ్ తో దుమ్ము లేపాడు. ఈ కథలో కార్తీక్ ను తప్ప మరి ఏ హీరో ని ఊహించుకోలేని అంత గొప్పగా యాక్ట్ చేశాడు. హీరోయిన్ రష్మిక, కార్తీక్ పక్కన చాలా అద్భుతంగా యాక్ట్ చేసింది. వీరిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ లో రష్మిక అద్భుతంగా యాక్ట్ చేసింది. రేష్మిక గ్లామర్ ఈ సినిమాకి బలం అని చెప్పవచ్చు. మిగతా పాత్రలో నటించిన నెపోలియన్ మరియు యోగి బాబు తమ పాత్ర మేరకు నటించారు. మిగతా వారు పర్వాలేదనిపించారు.
సాంకేతిక విషయాలు:
దర్శకుడు ఒక మంచి కథను ఎంచుకున్నాడు దానిని తెరపై చూపించే విషయంలో కొత్తదనం చూపించాడు. అయితే ఫస్ట్ ఆఫ్ లో స్టొరీ పై దృష్టి పెట్టలేదు. మధ్యలో కొన్ని సన్నివేశాలు అసలు ఎందుకు వచ్చాయి అనిపిస్తాయి. యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇది ఈ సినిమాకు బలం అని చెప్పుకోవచ్చు. వివేక్ మెర్విన్ పాటలు మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. ఫోటోగ్రఫీ బాగుంది. మొత్తం మీద సినిమా ఓకే అనిపిస్తుంది.