అక్కినేని కుటుంబ వ్యక్తిగా నటుడు సుమంత్ సినీరంగ ప్రవేశం చేశాడు. ప్రేమ కథ సినిమా తో తెలుగు తెరకు పరిచయమైన సుమంత్, ఆ తర్వాత సత్యం సినిమాతో హిట్ కొట్టి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత గౌరీ, మధుమాసం, గోదావరి వంటి సినిమాలు సుమంత్ ను హీరోగా నిలబెట్టాయి. కానీ, అదే జోరును కొనసాగించలేకపోయాడు.

ఈ మధ్య కాలంలో మళ్లీ కొన్ని సినిమాలు చేసిన విజయం దక్కలేదు. కొంతకాలం క్రితం వచ్చిన “మళ్లీ రావా” సినిమా మాత్రం పర్వాలేదనిపించింది. ఇక సుమంత్ వ్యక్తిగత విషయానికి వస్తే 2004లో తొలిప్రేమ హీరోయిన్ ‘కీర్తి రెడ్డి’ ని వివాహం చేసుకున్నాడు. రెండు సంవత్సరాల తరువాత వీరిద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి సుమంత్ ఒక్కడే ఉంటున్నాడు.

అయితే, తాజాగా సుమంత్ మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సుమంత్ పెళ్లికి సంబంధించిన శుభలేఖలు వెలుగులోకి వచ్చాయి. కొంత కాలంగా పవిత్ర అనే అమ్మాయితో ప్రేమలో ఉన్న సుమంత్ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. అయితే తన పెళ్లి వేడుకను, ప్రైవేట్ కార్యక్రమంగా కొంతమంది స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో జరుపుకోవాలని సుమంత్ నిర్ణయించుకున్నారు.

సుమంత్ పెళ్లి చేసుకోబోయే పవిత్ర, తన కుటుంబానికి చెందిన అమ్మాయని తెలుస్తుంది. ఆమె ప్రస్తుతం న్యాయవాది గా పనిచేస్తుంది. ముఖ్యంగా సుమంత్ కు పవిత్ర బాల్య స్నేహితురాలు. పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డు లో వేదిక వివరాలు రహస్యంగా ఉంచారు. దీంతో సుమంత్ పెళ్లి ఎప్పుడు, ఎక్కడ జరగబోతుందని అక్కినేని అభిమానులు ఆసక్తి గా ఉన్నారు. అయితే త్వరలోనే సుమంత్ ఈ పెళ్లి గురించి అధికారిక ప్రకటన ఇవ్వనున్నారు.

x