దేశం మొత్తం ప్రస్తుతం కరోనా రెండొవ దశ తో పోరాడుతోంది. సామాన్యుల నుండి రాజకీయ నాయకులు మరియు ప్రముఖుల వరకు అందరూ కరోనా వైరస్ తో యుద్ధంలో చేస్తున్నారు. కరోనా వ్యాప్తి అరికట్టేందుకు ప్రభుత్వానికి సహాయం చేయడానికి, ప్రముఖులు విరాళాలు ఇస్తున్నారు. తాజాగా తమిళ నటుడు సూర్య కుటుంబం రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కోవడంలో తమిళనాడు ప్రభుత్వానికి ఒక కోటి రూపాయలు విరాళం ఇస్తానని ప్రతిజ్ఞ చేసింది.

సూర్య. తన తండ్రి శివకుమార్, సోదరుడు కార్తీలతో కలిసి ఈ రోజు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను వ్యక్తిగతంగా కలుసుకుని ఒక కోటి రూపాయల చెక్కును అందజేశారు. ఎం కె స్టాలిన్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినందుకు వారుని ఆకాంక్షించారు. సూర్య కుటుంబం ప్రస్తుతం అందరి నుండి చాలా ప్రశంసలను అందుకుంటోంది.

కరోనా యోధులలో సూర్య కూడా ఒకరు. ఫిబ్రవరిలో, సూర్య కు కరోనా పాజిటివ్ వచ్చినప్పటికి అతను ఎటువంటి సమస్యలు లేకుండా కోలుకున్నాడు. అతను తన సోదరుడు కార్తీతో కలిసి ప్రజలు మరియు అభిమానులను బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగత్తలు తీసుకోవాలని చెప్పారు.

x