సినీ పరిశ్రమలలో ప్రతి హీరోకి చాలా మంది అభిమానులు ఉంటారు మరియు వారికీ అభిమాన సంఘాలు కూడా ఉంటాయి. ఈ అభిమాన సంఘాల ద్వారా హీరోలు అవసరమైనప్పుడు సామాజిక పనులను నిర్వహిస్తారు. కానీ మహమ్మారి కరోనా కారణంగా ఈ అభిమాన సంఘాలు కూడా బాధపడుతున్నాయి ఎందుకంటే అభిమానులు చాలా వరకు ఉద్యోగాలు కోల్పోయారు. దీనితో తన అభిమానులకు సాయం చేయడానికి కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ముందుకు వచ్చారు.
సూర్య తన అభిమాన సంఘాలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ, వారికీ అవసరమైన సాయాన్ని చేస్తూ ఉంటారు. తాజా సమాచారం ప్రకారం ఈ కరోనా పరిస్థితుల వల్ల 250 మంది ఫ్యాన్ క్లబ్ సభ్యులు తమ ఉద్యోగాలు కోల్పోయారని తెలియడంతో సూర్య ఒక్కొక్కరికి రూ. 5000 చొప్పున వ్యక్తిగత సహకారం అందించారు. ఈ డబ్బు నేరుగా ప్రతి అభిమాని బ్యాంకు ఖాతాల్లో జమ అయింది. అంతేకాదు, తన ఫౌండేషన్ ద్వారా ఆర్థికంగా బలహీనమైన విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఆర్థిక సహాయం చేస్తున్నారు.