క్రికెట్ అభిమానులకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) శుభవార్త తెలిపింది. ఐసీసీ తాజాగా టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ను రిలీజ్ చేసింది. ఈ షెడ్యూల్ అక్టోబర్ 17 నుండి సూపర్ 12 స్థానం కోసం పోటీపడే జట్లకు మ్యాచ్ లను నిర్వహించబోతున్నారు. ఇక అక్టోబర్ 23న ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య మొదటి టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ జరగనుంది.
ఈ టీ-20 ప్రపంచకప్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. కానీ, దేశంలో కరోనా పరిస్థితి కారణంగా యూఏఈ మరియు ఒమన్ లో ఈ మ్యాచ్లు జరగనున్నాయి. పాకిస్థాన్ తో భారత్ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ అక్టోబర్ 24న జరగనుంది. దీని తరువాత భారత్ అక్టోబర్ 31న న్యూజిలాండ్ తో మరియు నవంబర్ 3న ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడనుంది.
నవంబర్ 5న మరియు నవంబర్ 8న కూడా ఇండియా మ్యాచ్‌లు ఉన్నాయి. కానీ, ప్రత్యర్థులు ఇంకా ఖరారు కాలేదు. అక్టోబర్ 17 నుంచి ప్రారంభం కానున్న లీగ్ మ్యాచ్లు పూర్తయిన తర్వాత ఈ ప్రత్యర్థుల వివరాలు తెలియనున్నాయి. ఇక నవంబర్ 10,11 తేదీల్లో సెమీ ఫైనల్స్ మరియు నవంబర్ 14న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.