మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా గత నెలలో OTT ప్లాట్ ఫామ్ అయినా ఆహా సిరీస్ ‘11 అవర్స్ ’తో డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ప్రవేశించింది. ప్రవీణ సత్తారు ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించాడు, ఇప్పుడు, తమన్నా తన రెండవ OTT సిరీస్ విడుదలకు సిద్ధమైంది. ఆ సిరీస్ మే 14 న డిస్నీ + హాట్‌స్టార్‌లో విడుదల అవుతుంది. నవంబర్ స్టోరీ అనే పేరుతో క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సిరీస్ తెరకెక్కింది.
తమన్నా మాట్లాడుతూ, నవంబర్ స్టోరీ కోసం పనిచేయడం నాకు చాలా గుర్తుండిపోయే ప్రయాణం ఇది. అంతేకాదు నవంబర్ స్టోరీ అనేది తండ్రి మరియు కుమార్తె మధ్య సంబంధాన్ని చూపిస్తుంది, కుమార్తె తన క్రిమినల్ తండ్రి ప్రతిష్టను కాపాడటానికి ప్రయత్నిస్తుంది. ఈ సిరీస్‌లో తమన్నా పాత్ర పేరు అనురాధ.
జిఎం కుమార్, పసుపతి, వివేక్ ప్రసన్న, నమీత కృష్ణమూర్తి కూడా ఈ సిరీస్‌లో ఒక భాగం. ఇంద్ర సుబ్రమణ్యం దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ను ఆనంద వికటన్ నిర్మించాడు. ఈ సిరీస్ మే 14 న తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో ఏకకాలంలో విడుదల కానుంది.