ప్రధాన పాత్రల్లో నటించడమే కాకుండా, స్టార్ నటి తమన్నా ప్రత్యేకమైన ఐటమ్ సాంగ్స్ తో ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ ఐటమ్ సాంగ్స్ అనేవి అగ్ర హీరోల సినిమాల్లో చాలా కామన్. మూవీ మేకర్స్ పెద్ద హీరోయిన్స్ కి భారీ పారితోషకం ఇచ్చి ఈ ఐటమ్ సాంగ్స్ ని చేయిస్తారు. తమన్నా ఇప్పటికే, జై లవకుశ, కేజిఎఫ్ చాప్టర్ 1, అల్లుడు శీను, సరిలేరు నీకెవ్వరు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసి అందరిని మెప్పించింది. ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘గని’ సినిమాలో తమన్నా ఒక ఐటమ్ సాంగ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన సన్నివేశానికి ముందు ఈ ఐటమ్ సాంగ్ ఉండనున్నట్లు తెలుస్తుంది. వరుణ్ తేజ్ తో తమన్నా స్క్రీన్ కెమిస్ట్రీ ఫ్రెష్ గా ఉంటుందని చిత్రబృందం భావించి ఈ ఐటమ్ సాంగ్ కోసం తమన్నాని సంప్రదించారు. అయితే, తమన్నా ఈ స్పెషల్ సాంగ్ కి ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. మిగతా ఐటమ్ సాంగ్స్ లాగా, ఈ ఐటమ్ సాంగ్ కూడా గ్లామరస్ గా ఉండనుంది.

బాక్సింగ్ డ్రామా గా తెరకెక్కనున్న ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించనుంది. ఈ చిత్రం ఈ ఏడాది చివరి నాటికి తెరపైకి రానుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం తమన్నా, వరుణ్ తేజ్ ఎఫ్ 3 సినిమా కోసం పని చేస్తున్నారు.

x