తెలుగు ఓ టి టి ఛానల్ అయినా ఆహా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. ఇప్పుడు ఆహా, ఉగాది పండుగ వేడుకలను తెలుగు ప్రేక్షకులకు ముందుగానే అందించడానికి సిద్దమైంది. దీనికి సంబంధించి ఏప్రిల్ 9న మిల్కీ బ్యూటి తొలిసారిగా నటించిన ఒరిజిన‌ల్ ‘లెవన్త్ అవర్’ ఆహా లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఆహా లో చాలా టాప్ షోస్ జరుగుతున్నాయి. అవి శ్యామ్ జామ్, నంబర్ వన్ యారి మొదలైనవి. అంతేకాకుండా లేటెస్ట్ మూవీస్ అయినా క్రాక్ మరియు అల్లరి నరేష్ నాంది వంటి సినిమాలు కూడా ఆహ లో రిలీజ్ అయ్యి తెలుగు ప్రేక్షకులను ఎంతోగానో ఎంటర్ టైన్ చేస్తున్నాయి

Tamanna Latest Web Series ‘Levent Hour’ Trailer

 

ఆహ ఇప్పుడు తమన్నా నటించిన ‘లెవన్త్ అవర్’ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. పురుషాధిక్యత ఉన్న ఈ ప్రపంచంలో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకోవడానికి ఆరాత్రిక రెడ్డి అనే ఒక అమ్మాయి ఎలా పోరాటం చేసింది అనేది ఈ స్టోరీ. ఈ వెబ్ సిరీస్ డ్రామా మరియు త్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రూపొందింది. ఈ వెబ్ సిరీస్ మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ గా రూపొందింది.

తెలుగు ప్రేక్షకులను అలరించడానికి ఏప్రిల్ 9న ఉగాది సందర్భంగా ఈ వెబ్ సిరీస్ ఆహా లో ప్రసారం చేయనున్నారు. తెలుగు లో ఇప్పటివరకు వచ్చిన అన్ని వెబ్ సిరీస్ కన్నా ఈ వెబ్ సిరీస్ అతిపెద్ద వెబ్ సిరీస్.ఈ వెబ్ సిరీస్ ఉపేంద్ర నంబూరి గారు రచించిన 8 అవర్స్ పుస్తకం ఆధారంగా రూపొందించారు. ‘లెవన్త్ అవర్’ వెబ్ సిరీస్ కు ప్రదీప్ ఉప్పలపాటి రైటర్ గా వ్యవహరించారు. ప్రవీణ్ సత్తారు ‘లెవన్త్ అవర్’ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేసాడు.

image source

x