తమన్నా యొక్క మొదటి వెబ్ సిరీస్ 11 అవర్స్ ప్రేక్షకుల ప్రశంసలను పొందడంలో విఫలమైందని చెప్పవచ్చు. ఇప్పుడు తమన్నా భాటియా నవంబర్ స్టోరీ వెబ్ సిరీస్ పై తన ఆశలను పెట్టుకుంది. ఈ కొత్త వెబ్ సిరీస్ డిస్నీ + హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. క్రైమ్ థ్రిల్లర్ గా పేరుపొందిన ఈ వెబ్ సిరీస్ ను ఇంద్ర సుబ్రమణియన్ దర్శకత్వం వహించాడు. దీనిని ఆనంద వికటన్ నిర్మిస్తున్నారు.

నవంబర్ స్టోరీ ఒక మిస్టరీ త్రిల్లర్, అనురాధ అనే ఎథికల్ హ్యాకర్ అల్జీమర్‌ తో బాధపడుతున్న బెస్ట్ క్రైమ్ నవ లిస్ట్ ఆయన తన తండ్రిని ఒక క్రైమ్ సీన్ లో ఉండటాన్ని చూస్తుంది. ఈ మర్డర్ కేస్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ రంగంలోకి దిగుతుంది. ఈ ఇన్వెస్టిగేషన్ కు ఫేమస్ డాక్టర్ హెల్ప్ చేస్తారు. అనురాధ తన తండ్రిని ఈ కేసులో కి ఇన్వాల్ అవ్వ నీయకుండా ఎలా చూస్తుంది మరియు క్రైమ్ కిల్లర్ ను ఎలా పట్టుకుంటుందనేదే స్టోరీ.

ఈ వెబ్ సిరీస్‌లో మొత్తం 7 ఎపిపిసోడ్స్ గా తెరకెక్కింది. ప్రతి ఎపిసోడ్ యొక్క వ్యవధి 36 నిమిషాల కంటే ఎక్కువ. ఈ సిరీస్ తెలుగు, తమిళ మరియు హిందీ భాషలలో లభిస్తుంది. ఈ వెబ్ సిరీస్ ను మొదట తమిళంలో తెరకెక్కించారు తర్వాత దీనిని తెలుగు మరియు హిందీ భాషల్లోకి అనువదించారు.

తమన్నాతో పాటు, ఈ సిరీస్‌లో జిఎం కుమార్, పశుపతి, వివేక్ ప్రసన్న, అరుల్‌డోస్ మరియు ఇతరులు ఉన్నారు. ఈ సిరీస్‌లో తమన్నా క్యారెక్టర్ పేరు అనురాధ.తమన్న నవంబర్ స్టోరీ ఇప్పుడు డిస్నీ + హాట్‌స్టార్‌లో..!

x