ప్రముఖ తమిళ హాస్య నటుడు వివేక్ గుండెపోటుతో మరణించారు. శుక్రవారం ఉదయం గుండెపోటుతో చెన్నైలోని సిమ్స్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఆయన చికిత్స పొందుతూ ఉదయం 4.35 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వివేక్ అసలు పేరు వివేకానందన్. ఆయన 1961 నవంబర్ 19న జన్మించాడు. ఆయనను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది కె. బాల చందన్. తమిళంలో బెస్ట్ కమెడియన్ గా మూడు సార్లు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు.

ఈ మధ్యన కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వివేక్, వైరస్ నుంచి సురక్షితంగా ఉండాలంటే ఇంటి చిట్కాల తో పాటు యాక్షన్ కూడా తీసుకోవాలన్నారు. దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించిన వివేక్ ఒక తమిళ ప్రేక్షకులను మాత్రమే కాకుండా తెలుగు వారిని కూడా తన అద్భుతమైన నటనతో మెప్పించాడు. బాయ్స్, సింగం, యముడు, శివాజీ వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

x