సిని పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు కె.వి.ఆనంద్ గారు గుండెపోటుతో చెన్నైలోని ఆస్పత్రిలో చేరిన ఆయన శుక్రవారం తెల్లవారుజామున 3: 30 నిమిషాలకు చనిపోయారు. ఆయన వయసు 54 సంవత్సరాలు ఆయన చనిపోవడంతో తమిళ చిత్ర పరిశ్రమ నటులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

చెన్నై లో పుట్టి పెరిగిన కె.వి.ఆనంద్ ఫోటో జర్నలిస్టుగా కెరీర్ ను ప్రారంభించారు. కల్కి, ఇండియా టుడే దిన పత్రికలో పని చేసి, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అయిన పి.సి.శ్రీరామ్ వద్ద సినిమాటోగ్రఫీ లో శిక్షణ పొందారు. తెన్మావిన్ కొంబాత్ అనే మలయాళ చిత్రంలో సినిమాటోగ్రాఫర్గా 1994లో కె.వి.ఆనంద్ కెరీర్ ను ప్రారంభించారు.

తమిళం, తెలుగు, మలయాళం మరియు బాలీవుడ్ చిత్రాలకు ఆయన సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. ఆ తర్వాత “కనా కందెన్” సినిమాతో దర్శకుడిగా మారదు. జీవా తో రంగం, సూర్య తో బ్రదర్స్, వీడొక్కడే లేటెస్ట్ గా బందోబస్తు వంటి విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించారు.

చివరిగా ఆయన సూర్యతో బందోబస్త్ సినిమా చేశారు. మలయాళంలో మోహన్ లాల్ నటించిన తెన్మావిన్ కొంబాత్ చిత్రానికి గాను 1994లో ఉత్తమ సినిమాటోగ్రాఫర్గా గా జాతీయ అవార్డును అందుకున్నారు. సినిమాటోగ్రాఫర్ గా తొలి చిత్రానికి జాతీయ అవార్డు రావడం విశేషం. కె.వి.ఆనంద్ హఠాత్ మరణం పై తమిళ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది.

x