కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకీ మరింత వ్యాపిస్తుంది, దీంతో దేశవ్యాప్తంగా కరోనా బాధితుల తో పాటు మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుంది. సామాన్యుల నుంచి రాజకీయ నాయకులు మరియు సినీ ప్రముఖులు ఇలా ఒక్కరిని కూడా వదలకుండా వ్యాపిస్తుంది. ఇటీవల సినీ ఇండస్ట్రీలో రోజుకొక చెడు వార్త వినాల్సి వస్తుంది.
ఇప్పటికే చాలా మంది ప్రముఖులు కరోనా తో మరణించగా, తాజాగా తమిళ డైరెక్టర్ తమిరా కరోనా తో కన్నుమూశారు. గత 20 రోజుల క్రితం ఆయనకు కోవిడ్ పాజిటివ్ రావడంతో చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం మధ్యాహ్నం ఆయన తుది శ్వాస విడిచారు.
తమిరా కు కరోనా తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఉండటమే ఆయన మరణానికి కారణమని ఆస్పత్రి వర్గాలు వెల్లడించారు. తమిళ లెజెండరీ దర్శకుడు కె.బాలచందర్ తో పాటు మరి కొందరి అగ్ర దర్శకుల దగ్గర అసిస్టెంట్ గా పని చేశారు. వాళ్ల దగ్గర దర్శకత్వం విభాగంలో పనిచేసిన అనుభవంతోనే మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.