హీరోయిన్ తాప్సీ కు తెలుగులో అవకాశాలు తగ్గిపోవడంతో, బాలీవుడ్ కి వెళ్ళి అక్కడ వ‌రస సినిమాలు చేస్తూ మంచి విజ‌యాల‌ను అందుకుంది. చాలా కాలం తరువాత మరో తెలుగు సినిమాతో ఆమె మన ముందుకు రానుంది. మ్యాటినీ ఎంటర్టైన్మెంట్స్ తెరకెక్కిస్తున్న ‘మిషన్ ఇంపాజిబుల్’ చిత్రం కోసం మూవీ మేకర్స్ తాప్సీ ను ఖరారు చేశారు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ డైరెక్టర్ స్వరూప్ తన రెండో సినిమాగా ఈ ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నారు. నిరంజన్ రెడ్డి మరియు అన్వేష్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం బౌంటీ హంటింగ్ నేపథ్యంలో తెరకెక్కనుంది.

ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమాలో తాప్సీ పాత్రకి ఎంతో ప్రాధాన్యం ఉందని, కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె చివరి తెలుగు చిత్రం 2018 లో విడుదలైన ‘నీవెవరో’. ఆమె మరోవైపు క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ లో నటించబోతున్నారు. ఈ సినిమాను శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. నటి కూడా ఈ పాత్ర కోసం ఇంటెన్సివ్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఈ చిత్రానికి ‘షాబాష్ మిథు’ అని పేరు పెట్టారు.

x