టాలీవుడ్ లో అందరు ఆసక్తిగా ఎదురు చూసే ప్రాజెక్టులలో ప్రశాంత్ నీల్, జూనియర్ ఎన్టీఆర్ కలయికలో రానున్న సినిమా ఒకటి. వీరిద్దరి కలయికలో సినిమా వస్తుందని తెలిసినప్పటి నుంచి ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి. మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ధ్రువీకరించారు. కానీ, ఈ సినిమాలో ఎన్టీఆర్ యొక్క పాత్ర గురించి ఎటువంటి వివరాలు వెల్లడించలేదు.

ఇదిలా ఉండగా ఈ రోజు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పుట్టినరోజు సందర్భంగా, జూనియర్ ఎన్టీఆర్ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ, “ఎప్పటిలాగే అద్భుతంగా ఉందండి, మీ దళాలలో చేరడానికి నేను ఎదురుచూస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు.

ఈ చిత్రం రాజకీయ నేపథ్యంలో ఉంటుందని, తారక్ రాజకీయ నాయకుడిగా కనిపిస్తారని పుకార్లు వస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టు గురించి ఎటువంటి వివరాలు వెల్లడించలేదు. ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ చాప్టర్ 2 మరియు సాలార్ యొక్క షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. తారక్ RRR షూటింగ్ పూర్తి చేయడానికి ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ 31వ చిత్రంగా దీనిని నిర్మిస్తున్నారు.

x