టిడిపి సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావు గారు ప్రెస్ మీట్ ఏర్పాటుచేశారు. ఆయన మాజీ రాజ్యసభ సభ్యుడు. ఆయన వయస్సు 102 సంవత్సరాలు. ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో కరోనా విజృంభిస్తున్న కారణంగా అందరూ వాక్సిన్ తీసుకోవాల్సిందిగా కోరారు. ఆయన మాట్లాడుతూ, నాకు ఇప్పుడు 102 ఏళ్ల వయస్సు ఉన్న ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను.

అయనప్పటికీ నేను వాక్సిన్ వేయించుకున్నాను. అందరికీ ఆదర్శంగా నిలవాలనే ఆలోచనతో నేను ఈ వ్యాక్సిన్ వేయించుకున్నట్లు ఆయన తెలిపారు. ఇటీవల ఆయన డివిసి ఆస్పత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఆయన మీడియా తో మాట్లాడుతూ ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, అంతేకాకుండా అందరూ భౌతిక దూరం పాటించాలని, ఎల్లవేళల శానిటైజెర్లు వాడాలని ఆయన తెలిపారు.

x