తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా యొక్క వ్యాప్తిని ఆరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో 10 రోజుల పాటు సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించింది. ఈ రోజు కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసిన సిఎం కెసిఆర్, కరోనా కేసుల పెరుగుదల కారణంగా రాష్ట్రంలో కఠినమైన చర్యలను మరియు పూర్తి లాక్డౌన్ విధించే నిర్ణయాన్ని ఆమోదించారు. లాక్డౌన్ పై ఒక కఠినమైన నిర్ణయం తీసుకోమని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ తర్వాత ఈ నిర్ణయం అమలులోకి వచ్చింది.

మే 12 ఉదయం 10 గంటల నుండి, మే 22 వరకు రాష్ట్రంలో ఈ లాక్డౌన్ కొనసాగుతుంది. అవసరమైన సేవలకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. అన్ని కార్యకలాపాలకు ఉదయం 6 నుండి 10 గంటల మధ్య టైమ్ కేటాయించింది ప్రభుత్వం.మరో పక్క కోవిడ్ -19 వ్యాక్సిన్ కొనుగోలు చేయడానికి గ్లోబల్ టెండర్లను పిలవాలని కేబినెట్ నిర్ణయించింది.

x