నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని టెంపో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన వారంతా చెన్నై వాసులుగా గుర్తించారు. శ్రీశైలం నుంచి నెల్లూరు వైపుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ నిద్రమత్తులో లారీని ఢీ కొట్టిన టు తెలుస్తుంది.

వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు హారిక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వారిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. ముగ్గురు పురుషులు ఉన్నారు. అయితే వాళ్ళందరూ కూడా తమిళనాడు రాష్ట్రం కడక్ పూర్ కి చెందిన వారిగా పోలీసులు గుర్తించడం కూడా జరిగింది. అర్ధరాత్రి రెండు రెండున్నర సమయం మధ్యలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మిగిలిన ఏడుగురు మందిలో ముగ్గురు పరిస్థితి క్రిటికల్ గా ఉంది. మిగిలిన నలుగురు కూడా స్వల్ప గాయాలతో బయట పడటం జరిగింది.

x