బోయపాటి శ్రీను మరియు బాలకృష్ణ కలయికలో వస్తున్న ‘అఖండ’ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం యొక్క చివరి షెడ్యుల్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభమైంది. ప్రస్తుతం స్టంట్ మాస్టర్ శివ పర్యవేక్షణలో తమిళనాడు లోని ఒక ఆలయంలో క్లైమాక్స్ సీన్స్ ను తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా లోని క్లైమాక్స్ ఫైట్ కోసం నిర్మాతలు భారీ మొత్తాన్ని ఖర్చు చేస్తున్నారు. ఈ క్లైమాక్స్ ఫైట్ తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనుల గురించి బోయపాటి శ్రీను చాలా శ్రద్ధ వహిస్తున్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు వేర్వేరు పాత్రల్లో కనిపించనున్నారు. ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు.

x