తకితా తకితా, ప్రేమా ఇష్క్ కదల్ మరియు అనామికా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటుడు హర్షవర్ధన్ రాణే ఇప్పుడు ఆక్సిజన్ సిలెండర్లు తీసుకురావడానికి నిధులు సేకరించడానికి తన వంతు ప్రయత్నంగా తన బైక్‌ను అమ్మకానికి సిద్ధపడ్డాడు. కరోనావైరస్కి వ్యతిరేకంగా భారతదేశం తీవ్రంగా పోరాడుతోంది మరియు ఒక పక్క ఆక్సిజన్ కొరత ప్రజలను చంపేస్తుంది.

నటుడు హర్షవర్ధన్ రాణే తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక విషయాన్ని అందరితో పంచుకున్నాడు, “ నా మోటార్‌సైకిల్‌ కు బదులుగా ఆక్సిజన్ ఇవ్వగలిగితే అది అవసరం అయిన వారికి ఉపయోగపడుతుంది, దయచేసి హైదరాబాద్‌లో మంచి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ వెతకడంలో నాకు సహాయపడండి… అంటూ తెలియచేశాడు.

భారతదేశం రోజుకు 4 లక్షలకు పైగా కొత్త కేసులను నమోదవడంతో, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ కూడా కుప్పకూలిపోతోంది. ఆసుపత్రి పడకలు, ఆక్సిజన్ సరఫరా మరియు మందులు లేకుండా ప్రజలు కష్టపడుతున్నారు.

ఈ పరిస్థితిలో హర్షవర్ధన్ చేసినట్టు, మరికొందరు ప్రముఖులు కూడా దేశ సంక్షేమానికి తమ వంతు సహకారం అందించారు. నటి కిమ్ శర్మతో విడిపోయినందుకు గత ఏడాది ముఖ్యాంశాలలో ఉన్న హర్షవర్ధన్ కు ప్రస్తుతం నెటిజన్లు సోషల్ మీడియాలో కృతజ్ఞతలు చెబుతున్నారు.

x