మాయదారి మహమ్మారి మళ్లీ విజృంభిస్తుంది, చాప కింద నీరులా ముంచుకొస్తుంది. అంతా అయిపోయిందనుకుంటున్న సమయంలో కరోనా కోరలు చాపుతుంది. ఒక వైపు వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందో లేదో, కేసులు కూడా పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఐదు రాష్ట్రాల్లో వేగంగా పెరుగుతున్నాయి.

        1. మహారాష్ట్ర
        2. కేరళ
        3. పంజాబ్
        4. మధ్యప్రదేశ్
        5. ఛత్తీస్‌ఘఢ్

Corona Cases in Maharashtra:

గత వారం రోజుల నుండి మహారాష్ట్ర లో సీన్ మారిపోయింది. ముఖ్యంగా రోజుకి 6000 పైగా నమోదవుతున్నాయి. దేశంలో అత్యధిక కేసులు నమోదవుతుంది మహారాష్ట్రలోనే. కొన్ని రోజుల క్రితం ఇక్కడ రోజువారీ కేసులు 3000 లకు లోపే ఉండేవి.

కానీ ఇప్పుడు కేసులు, పెరుగుతూ కనిపిస్తున్నాయి. కొత్తగా 2749 కరోనా కేసులు వచ్చాయి. దీనితో విఎంసి అధికారులు అలెర్ట్ అయ్యారు. 1305 భవనాలను సీజ్ చేసారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారికీ క్వారంటైన్ తప్పనిసరి.

Corona Cases in Mumbai:

ముంబైలో అడుగు పెట్టాలంటే కరోనా నెగటివ్ రిపోర్ట్ తప్పనిసరి అని చెప్తున్నారు. అమరావతి, యావత్మాల్ జిల్లాలతో పాటు, ముంబైలో కఠిన ఆంక్షలు విధింహరు అధికారులు. లోకల్ ట్రైన్స్ ప్రారంభించిన తర్వాత కేసులు పెరగటంతో నివారణ చర్యలు చేపట్టారు. లోకల్ ట్రైన్స్ లో మాస్కస్ లు పెట్టుకోకుండా తిరుగుతున్నవారిని గుర్తించి పట్టుకునేందుకు 300 మంది అధికారులను నియమించారు.

Corona Cases in Kerala:

కేరళ లోనూ కేసులు పెరుగుతున్నాయి, అత్యథిక కేసులు నమోదు అవుతున్న జాబితాలోకి కేరళ 2వ ప్లేస్ లో వుంది. శుక్రవారం ఇక్కడ 4,584 కేసులు వచ్చాయి. దీనితో అక్కడ మొతం కరోనా కేసులు పది లక్షలకు చేరాయి. కరోనా అరికట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్న కేరళలో మాత్రం అదుపులోకి రావడం లేదు.

Corona Cases in Punjab:

మహారాష్ట్ర ,కేరళ తరువాత పంజాబ్ లోను కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. కొత్తగా ఇక్కడ 383 కేసులు వచ్చాయి. గత 6 రోజులుగా ఇక్కడ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చాయి. స్థానిక ఎన్నికల సమస్య కారణంగా కేసులు పెరుగుతున్నట్టు అనుమానిస్తున్నారు.

Corona Cases in Madhya Pradesh:

గత సంవత్సరం నవంబర్, డిసెంబర్ నెలలో తగ్గుతూ వచ్చిన కరోనా కేసులు ఇప్పుడు మధ్యప్రదేశ్ లో వణుకు పుట్టిస్తుంది. ఇక్కడ కొత్తగా 297 కేసులు నమోదు అయ్యాయి.

Corona Cases in Chhattisgarh:

ఛత్తీస్‌ఘఢ్ లోను 259 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ ఐదు రాష్ట్రాలలో కేసులు ఎక్కువగా పెరుగుతున్నట్లు కేంద్రం వెల్లడించింది. వెంటనే ఆ ఐదు రాష్టాలలో కరోనా కట్టడి చర్యలు తీసుకోవాలి అని కేంద్రం చెబుతుంది.

ఇప్పటికే దేశ వ్యాప్తంగా వాక్సినేషన్ ప్రక్రియ మొదలు పెట్టారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ కి టీకా పంపిణి కొనసాగుతుంది. కానీ అదే స్థాయిలో కొత్త కేసులు వస్తున్నాయి. ఇదే ఆందోళనకు గురి చేస్తుంది. అయితే కరోనా వెళ్ళిపోయిందని అని లైట్ తీసుకోవడం మాస్కులు లేకుండా తిరగడం కారణంగానే కేసులు పెరుగుతున్నట్లు చెబుతున్నారు.

x