దేశమంతా కరోనా కలకలం సృష్టిస్తుంది, ఎటు చూసినా మనస్సు కలిచివేసే దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఈ వైరస్ వల్ల రోజుకు వేలాది మంది ప్రజలు ప్రాణాలను కోల్పోతున్నారు. రాజస్థాన్ లో ఒక వ్యక్తి కరోనా భారిన పడి మృతి చెందగా, తండ్రి మరణాన్ని కూతురు తట్టుకోలేకపోయింది తండ్రి చితికి నిప్పంటించగానే ఆ మంటల్లోకి ఒక్కసారిగా దూకేసింది.

అయితే అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు ఆమెను కాపాడి ఆమెను వెంటనే హాస్పిటల్ కి తరలించారు. తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఆ యువతి చికిత్స పొందుతుంది.

వివరాల్లోకి వెళ్తే రాజస్థాన్‌ రాష్ట్రం బాడ్‌మేర్‌లోని రాయ్‌ కాలనీకి చెందిన దామోదర్ దాస్ షార్దా అనే వ్యక్తి ఇటీవల కరోనా భారిన పడ్డాడు. ఆయన హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. అనంతరం అంత్యక్రియల కోసం స్మశానానికి తరలించారు ఈ సమయంలో అతని కుమార్తె చంద్ర శారద కూడా ఉంది.

తండ్రి తనాన్ని విడిచి వెళ్లిపోతున్నాడని భరించలేక ఒక్కసారిగా తండ్రి కాలిపోతున్న చితిలోకి దూకేసింది. పక్కన ఉన్న ఆమె సోదరి మరియు మిగతా వాళ్లు కాపాడే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే చంద్ర శారద తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను జోధ్‌పుర్‌ లోని హాస్పిటల్ కి తరలించారు. శరీరం 70 శాతానికి పైగా కాలిపోయిందని, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. ఈ ఘటన రాజస్థాన్ లో కలకలం రేపింది.

x