దేశంలో రెండో దశ తీవ్ర స్థాయిలో విజృంభించడం వెనుక భారత్ గుర్తించిన డెల్టా వేరియంట్ ఉన్నట్లు ప్రభుత్వ అధ్యనంలో తేలింది. ఈ డెల్టా వేరియంట్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఇది అత్యంత ప్రమాదకరంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. ఈ రకమైన స్ట్రెయిన్ తమ దేశంలోను వ్యాపిస్తుందని అమెరికా తెలిపింది. ప్రజలందరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని సూచించింది.

భారత్లో అత్యధికంగా వ్యాపించిన కరోనా డెల్టా వేరియంట్ లో ఒక స్ట్రెయిన్ అత్యంత ప్రమాదకరంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ రకమైన వైరస్ మూడు స్ట్రెయిన్లుగా మారిందని వాటిలో లో బి.1.617.2 రకం మాత్రం అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది.

గత నెల బి.1.617ను ఆందోళనకర వేరియంట్ గా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఇప్పుడు దీనిలో బి.1.617.2 స్ట్రెయిన్ మాత్రమే ఆందోళనకర వేరియంట్ గా తెలిపింది. మిగిలిన రెండు స్ట్రెయిన్లు తక్కువగా వ్యాపిస్తునట్లు గమనించామని, ఈ రకం వైరస్ వ్యాపిస్తున్న దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు గుర్తించామని తెల్పింది.

భారత్లో వేగంగా వ్యాపిస్తున్న కరోనా డెల్టా వేరియంట్ అమెరికాలో కూడా వ్యాప్తి చెందుతుందని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ప్రముఖ అంటువ్యాధి నిపుణులు ఆంటోనీ ఫౌచీ ఆందోళన వ్యక్తం చేశారు. తొందరగా వ్యాక్సిన్ వేయించుకోవాలి అని దేశ పౌరులను సూచించారు. యు.కె లో ఈ డెల్టా వేరియంట్ 12 – 20 ఏళ్ల మధ్య వయసులో వేగంగా వ్యాపిస్తుంది అని చెప్పారు.

అమెరికాలో నమోదవుతున్న కొత్త కేసుల్లో 6 శాతం డెల్టా వేరియంట్ కేసులేనని ‘ఫౌచీ’ తెలిపారు. వాటిపై యూఎస్ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. యూకేలో గుర్తించిన ఆల్ఫా వేరియంట్ కన్నా డెల్టా వేరియంట్ ప్రమాదకరంగా మారుతుందని అన్నారు.

x