గత రెండు రోజులుగా సుమంత్ రెండో వివాహం చేసుకుంటున్నట్లు అనేక వార్తలు వచ్చాయి. పవిత్ర అనే అమ్మాయితో సుమంత్ వివాహం అన్నా శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా సుమంత్ రెండో వివాహం గురించి రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేయటంతో ఈ వార్త మరింత బలపడింది. కానీ ప్రస్తుతం ఈ వార్త అబద్ధమని తేలింది. ఎందుకంటే ఇది సినిమాకు సంబంధించిన శుభలేఖ. నిజమైన వివాహానికి సంబంధించిన శుభలేఖ కాదు.

పెళ్లి శుభలేఖ గురించి మాట్లాడుతూ, సుమంత్ ఒక వీడియోని విడుదల చేశాడు. ఈ వీడియో లో సుమంత్ ఆ పెళ్లి శుభలేఖ తన రాబోయే చిత్రానికి సంబంధించిందని మరియు ఆ శుభలేఖ లీక్ అయిందని స్పష్టం చేశారు. ఈ చిత్రం విడాకులు మరియు పునర్వివాహం చుట్టూ తిరుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ త్వరలో విడుదల చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో సుమంత్ రెండో వివాహం చేసుకోవట్లేదని తేలిపోయింది. శుభలేఖ నిజంగా లీక్ అయిందా లేదా చిత్ర బృందమే ప్రమోషన్ కోసం లీక్ చేశారా అనేది తెలియదు.

 

x