వ్యవసాయానికి ఎద్దులే కీలకం. ఏ పంట వేసిన దున్నటానికి ఎద్దులు కావాల్సిందే. ఖర్చును దృష్టిలో ఉంచుకొని ఓ రైతు డిఫరెంట్గా ఆలోచించాడు. జోడు ఎద్దులను అద్ధెకి తీసుకు వచ్చాడు.
సాధారణంగా వ్యవసాయంలో పనిముట్లు, యంత్రాలను అద్దెకు తీసుకోవడం మనం చూస్తూ ఉంటాము. ఇందుకు బిన్నంగా ఓ రైతు జోడెద్దుల ను అద్దెకు తీసుకువచ్చి నూతన సాగు విధానానికి శ్రీకారం చుట్టారు. కేసముద్రం మండలం, ఉప్పర పల్లి గ్రామానికి చెందిన మంచాల కుమారస్వామి అనే రైతు జోడు ఎద్దులను ఏడాది పాటు అద్దెకు తీసుకున్నాడు.
ఆ రైతు గంగారం మండలంలోని ఒక వ్యక్తి నుంచి రెండు ఎడ్లను వచ్చే ఉగాది వరకు 10వేల రూపాయలకు అద్దె చెల్లించి ఒక్క ఒప్పందం చేసుకొని తెచ్చాడు. ప్రస్తుతం ఆ రైతు మిర్చి పంటలను సాగు చేస్తున్నాడు. మిర్చిలో కలుపు నివారణకు, దున్నడానికి నాగలి, ఎడ్ల కు ఎకరానికి 1500 రూపాయల చొప్పున రెండు ఎకరాలకు 3 వేల రూపాయలు అవుతాయని.. ఇలా 10 సార్లు చేయాల్సి ఉండటంతో ఖర్చును తగ్గించాలని ఆ రైతు అనుకున్నాడు. దీంతో ఏకంగా ఆ రైతు ఎడ్లను అద్దెకు తీసుకువచ్చాడు. ఈ రైతు ఎడ్లను అద్దెకి తీసుకురావటం వింతగా ఉందని గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.