ముక్కు కు ఆక్సిజన్, చేతికి సెలైన్ తో హాస్పిటల్ బెడ్ మీద పాటలు వింటూ కనిపించిన యువతి చివరకు కరోనా కు బలైపోయింది. గతవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ఎంతో మంది గుండెల్లో స్ఫూర్తిని నింపిన ఆమె గుండె కరోనా ముందు ఓడిపోవాల్సి వచ్చింది.

ఢిల్లీకి చెందిన డాక్టర్ మౌనిక తన ట్విట్టర్ ఖాతాలో ఆమె వీడియో పోస్ట్ చేసింది. కరోనా సోకిన వ్యక్తికి ఐసీయూ బెడ్ దొరకకపోవడం తో కరోనా ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందించారు. సాధారణంగా అలాంటి ఆరోగ్య పరిస్థితిలో ఎవరైనా భయపడతారు మరియు కుంగిపోతారు కానీ ఆ అమ్మాయి మాత్రం ఎంతో ధైర్యం గా కనిపించింది.

పాటలు వినాలనిపిస్తుందని డాక్టర్ ను అడిగితె అందుకు ఒప్పుకున్నారు. బెడ్ పై ఫోన్ లో “లవ్ యు జిందగీ” పాట వింటూ చిరునవ్వులు చిందించన ఆమె వీడియోను డాక్టర్ మౌనిక ట్విటర్లో పోస్ట్ చేయగా ఇటీవల ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

4 రోజుల క్రితం ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఐసియు లో మార్చారు. ఈ విషయాన్ని డాక్టర్ మౌనిక తన ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ” ఈ ధైర్యమైన యువత కోసం అందరూ ప్రార్థించండి, కొన్నిసార్లు మనం చాలా నిస్సహాయుల అవుతాము మన చేతిలో ఏమీ ఉండదు అంతా భగవంతుడి చేతుల్లో ఉంటుందని” అవేదం వ్యక్తం చేసింది.

అయితే ప్రార్థనలు ఏమీ ఫలించాలా ఆమె చివరకు చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు కోల్పోయింది. “చాలా బాధాకరం ఒక ధైర్యమైన గుండెను కోల్పోయామని” డాక్టర్ మౌనిక నిన్న ట్విట్టర్ ద్వారా యువతి మరణవార్త తెలియజేశారు. ఈ ట్వీట్ చూసి నెటిజన్లు దిగ్బ్రాంతి కి గురయ్యారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని పోస్టులు పెడుతున్నారు.

x