ఒక వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేసి ఆమె మృతదేహాన్ని నడివీధిలో ఈడ్చుకెళ్లి రాక్షసత్వం తో వ్యవహరించాడు. ఆమె పై జరిగిన దాడి లో తన కుమారుడు ను కూడా పొట్టన పెట్టుకున్నాడు. తర్వాత అతను పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.

రాజస్థాన్ లోని రామ్‌పుర పరిధిలోని భాతాపూర్ లో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. కూలి పనులు చేసుకునే సునీల్ వాల్మీకి (40) పదిహేనేళ్ల క్రితం సీమ (35) అనే ఆమె ను వివాహం చేసుకున్నాడు. మంగళవారం మధ్యాహ్నం సోదరుడి ఇంట్లో ఉన్నటువంటి తన భార్య సీమ (35) మరియు కుమారుడు అవినాష్ (9నెలలు) ను తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. సాయంత్రం భార్యతో గొడవ పడిన సునీల్ ఆమెను గొడ్డలితో నరకడం తో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

సునీల్ అంతటితో ఆగకుండా ఆమె మృతదేహాన్ని నడివీధిలో 80 మీటర్ల వరకు తీసుకెళ్లి అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ దారుణాన్ని చూసిన స్థానికులంతా ఒక్కసారిగా భయపడిపోయారు. భార్యతో అతను గొడవ పడిన సమయంలో అక్కడే ఉన్న పసిబాలుడు కు కూడా గాయాలయ్యాయి. ఆ బాలుడు ని హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.

x