లక్షెట్టిపేట్ లో ఒక వింత ఘటన చోటుచేసుకుంది. కరోనా సోకిందనే కారణంతో కట్టుకున్న భర్త, భార్యను బాత్ రూమ్ లో ఉంచాడు. అంతేకాదు ఇంట్లో ఉన్న మరుగుదొడ్డిని కూడా వాడుకోవటానికి వీలులేకుండా ఆంక్షలు పెట్టాడు.

గోదావరి రోడ్డు గోపాల వాడలో నరసమ్మ, పెంటయ్య అనే భార్యాభర్తలు ఉన్నారు. ఐదు రోజుల క్రితం తన భార్య కు కరోనా సోకింది. ఇంట్లో సరిపోయే గదులు ఉన్న కూడా భర్త ఆమెను బాత్ రూమ్ లో ఉంచాడు. బయట ఒక గొయ్యి తవ్వి అందులో కాలకృత్యాలు తీర్చుకోమన్నాడు. గొయ్య నుంచి వచ్చే దుర్వాసన భరించలేక స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఆ ఇంటికి వచ్చిన పోలీసులు భర్తకు కౌన్సిలింగ్ నిర్వహించి బాత్ రూమ్ నుంచి ఆమెకు విముక్తి కలిగించారు. బెల్లంకొండ ఐసోలేషన్ సెంటర్ కు తరలించి మంచి వైద్యం అందిస్తామని చెప్పిన ఆమె అందుకు అంగీకరించలేదు. దీంతో ఆమె భర్తను ఒప్పించి ఇంట్లో ఒక గదిని కేటాయించారు.

x