కరోనా వల్ల మనుషుల్లో మానవత్వం కనుమరుగైపోతుంది. ప్రస్తుతం మనిషి ఎలా మరణించిన కరోనా వల్ల మృతిచెందారని భయంతో స్థానికులు మరియు బంధువులు అంత్యక్రియలకు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితి ఉత్తరప్రదేశ్లోని మాడిహౌ కొత్వాలి ప్రాంతంలో చోటు చేసుకుంది.

మాడిహౌ కొత్వాలి ప్రాంతంనికి చెందిన రాజ కుమారి అనే వృద్ధురాలు అనారోగ్యంతో హాస్పటల్ లో చికిత్స పొందుతూ మరణించింది. దీంతో భర్త తిలక్ భార్య మృత దేహాన్ని ఇంటికి తీసుకు వచ్చారు. భయంతో స్థానికులు మరియు బంధువులు ఎవరు కూడా అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకు రాలేదు.

పాపం ఏం చేయాలో అర్థం కానీ తన భర్త దిక్కు తోచని స్థితిలో సైకిల్ పై తన భార్య మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలించే ప్రయత్నం చేశాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అంతక్రియలు నిర్వహించారు. స్థానికులు యొక్క తీరు పై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

x