చైనా తన ఆయుధ సంపదను పెంచుకుంటుంది, ఒక బారి ఆయుధాన్ని ప్రపంచానికి చూపించింది. చైనా అతి పెద్ద జలాంతర్గామిని ప్రారంభించింది. ప్రపంచంలోనే అతి పెద్ద సబ్ మెరైన్ ను డ్రాగన్ కంట్రీ దీని తయారుచేసింది. హులుడావోలోని బోహైడ్ షిప్ యాడ్ లో ఈ జలాంతర్గామిని ప్రారంభించింది. దీని సైజు పరంగా చూసినా, ఆయుధం పరంగా చూసినా ఈ సబ్ మెరిన్ అత్యంత భారీ గా కనిపిస్తుంది. 210 మీటర్ల పొడవు మరియు 30 మీటర్ల వెడల్పు తో సబ్ మెరిన్ ను రూపొందించారు. “టైప్-100 సూన్  జూ శ్రేణి సబ్ మెరిన్” గా దీన్ని పిలుస్తున్నారు.

చైనా రూపొందించిన భారీ జలాంతర్గామి సూయజ్ కాలువ ను దాతే సైజులోనే ఉంది. చైనా పశ్చిమ దేశాలతో జరిగే యుద్ధానికి మధ్యధరా సముద్రమే వేదిక అయ్యే అవకాశం ఉంది. జూలై లో జరిగే చైనా కమ్యూనిస్టు పార్టీ శత వసంతాల వేడుకలో ఈ భారీ జలాంతర్గామిని ప్రదర్శించే ఛాన్స్ ఉంది. మొన్నటి వరకు రష్యా దగ్గర ఉన్న పిఆర్.941 టైపూన్ శ్రేణి సబ్ మెరైన్ అతి పెద్దది. రష్యా దేశపు జలంతర్గామి పొడవు 175 మీటర్లు, వెడల్పు 23 మీటర్ల, అమెరికాకు చెందిన, ఓహియో శ్రేణి లోని సబ్ మెరైన్ ల కంటే చైనా జలాంతర్గామి మూడు రెట్లు పెద్దది. ఓహియో శ్రేణి సబ్ మెరైన్ కు 24 బాలిస్టిక్ క్షిపణుల సామర్థ్యం ఉంది.

టైప్-100 మాత్రం 48 క్షిపణులను మోసుకెళ్లే సామర్థ్యం కలది. రష్యా దగ్గర ఉన్న టైపూన్ శ్రేణి కేవలం 20 క్షిపణులను మోసుకెళుతుంది. అణుశక్తి టార్పిడోలను కూడా చైనా అమర్చింది అని ప్రచారం జరుగుతుంది. ఈ టార్పిడోలను అడ్డుకోవడం దాదాపు అసాధ్యం వీటిని రష్యా నుంచి చైనా సమకూర్చుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2030నాటికి చైనా జలాంతర్గాములవే హావ అని నిపుణులు చెబుతున్నారు.

ఇప్పటికే ఈ ప్రాంతంలో లో వివిధ దేశాలకు చెందిన 239 సబ్ మెరైన్ లు సైలెంట్ గా సముద్రజలాల్లో ఉన్నాయి. 2030 నాటికి మరో 220 సబ్ మెరైన్ లు కొత్తగా చేరే అవకాశం ఉంది. చైనా దగ్గర 79 సబ్ మెరైన్ లు ఉండవచ్చని అంచనా. ప్రపంచంలోనే అత్యంత సబ్ మెరైన్ లు ఉన్న దేశంగా చైనా నిలిచే అవకాశం ఉందని తెలుస్తుంది. భారత్ కూడా అప్పటికి దాదాపు 21 సబ్ మెరైన్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

image source

x