తెలుగు ప్రేక్షకులు హీరో ‘ఉదయ్ కిరణ్’ పేరను అంత సామాన్యంగా మర్చిపోలేరు. “చిత్రం” లాంటి సూపర్ హిట్ సినిమాతో కథానాయకుడుగా పరిచయమై ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అయితే కాలం కలిసి రాకపోవడంతో అతను కొన్ని కారణాల వల్ల ఏడు సంవత్సరాల క్రితం ఆత్మహత్య చేసుకున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో అతని మరణం ఒక విషాదంగా మారింది. ఉదయ్ కిరణ్ “జై శ్రీరామ్” అనే సినిమాతో చివరిగా ప్రేక్షకులకు కనిపించారు. ఉదయ్ కిరణ్ ఆ సినిమా తర్వాత ఇంకో సినిమా కూడా చేశారు. ఆ సినిమా పేరు “చిత్రం చెప్పిన కథ”. కాకపోతే ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఉదయ్ కిరణ్ చనిపోయిన తర్వాత చిత్ర నిర్మాత అతనికి నివాళిగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు.
ఈ చిత్రం నుండి చిన్న టీజర్ కూడా విడుదల చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. ప్రస్తుతం ఈ సినిమాను విడుదల చేయాలనీ నిర్మాత భావిస్తున్నట్లు సినీ వర్గాల సమాచారం. అయితే ఇది చిన్న సినిమా కావడంతో, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని భావిస్తున్నారు. కనుక ఈ సినిమాను OTT లో రిలీజ్ చేయాలనీ ప్రయత్నిస్తున్నారు. హీరో ఉదయ్ కిరణ్ చివరి సినిమా కావడంతో జనాలు ఈ సినిమాను చూడటానికి ఇష్టపడతారని కనుక, ఈ సినిమాను OTT లో రిలీజ్ చేయడంతో పెట్టిన ఖర్చు వృధాగా పోకుండా ఉంటుందని చిత్ర నిర్మాత భావిస్తున్నారు.
ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తుందని మనం ఆశిద్దాం. ఈ సినిమాకు మోహన్ దర్శకత్వం వహించారు మరియు మున్నా ఈ సినిమాను నిర్మించారు. మదాలస శర్మ ఈ సినిమాలో హీరోయిన్గా నటించారు.