ఇటీవల కాలంలో తెలుగులో బాగా ప్రాచుర్యం పొందిన రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటికే నాలుగు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో, 5వ సీజన్ కు రెడీ అవుతుంది. ప్రస్తుతం ఈ 5వ సీజన్ పోటీదారుల ఎంపిక పుర్తి అయ్యి క్వారంటైన్ లో ఉన్నారు. సెప్టెంబర్ నుంచి ప్రసారం కానున్న ఈ షోకి కింగ్ నాగార్జున మూడోసారి హోస్ట్ గా కనిపించనున్నారు.

షణ్ముఖ్ జస్వంత్, యాంకర్ రవి, వర్షిని వంటి పేరున్న కళాకారులు ఈ షోకి సెలక్ట్ అయినట్లు అనేక పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే ‘స్టార్ మా’ బిగ్ బాస్ షో కి సంబంధించిన మరొక వెర్షన్ ను కూడా రెడీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బిగ్ బాస్ మేకర్స్ ఓటీటీ వెర్షన్ ను ప్రారంభించాలని చూస్తున్నారు.

ఈ వెర్షన్ లో కొత్త పోటీదారులు, కొత్త హోస్ట్ ఉండనున్నారు. సల్మాన్ ఖాన్ టెలివిజన్ వెర్షన్ కు హోస్ట్ గా వ్యవహరిస్తుంటే, కరణ్ జోహార్ ఓటీటీ వెర్షన్ కు హోస్ట్ చేస్తున్నారు. అదే పద్ధతిలో తెలుగులో కూడా ఓటీటీ వెర్షన్ ను లాంచ్ చేయాలనీ భావిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ టెలివిజన్ వెర్షన్ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది. బిగ్ బాస్ తెలుగు ఓటీటీ వెర్షన్ ను ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో టెలికాస్ట్ చేస్తారో తెలియాల్సి ఉంది.

ఈ ఓటీటీ వెర్షన్ లో బిగ్ బాస్ షో 24 గంటల పాటు ప్రసారం కానున్నట్లు తెలుస్తుంది. మరి ఈ ఓటీటీ వెర్షన్ కు హోస్ట్ గా ఎవరు చేయనున్నారు? ఈ షోలో పాల్గొనబోయే పోటీదారులు ఎవరు? ఇలాంటి వాటిపై క్లారిటీ రావాల్సి ఉంది.

x