కర్ణాటకలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. స్వయంగా ఓ అక్క తన చెల్లిని కూడా పెళ్లి చేసుకోవాలని పెళ్ళికొడుకుని పట్టు పట్టింది, అలాగైతేనే తాను పెళ్లికి అంగీకరిస్తానని తేల్చి చెప్పేసింది. దీంతో పెళ్లి కొడుకు చేసేదేమి లేక పెద్దల అనుమతితో ఇద్దరు మహిళల మెడలో తాళి కట్టాడు.
సాధారణంగా మనం సినిమాల్లో అక్కాచెల్లెళ్లను హీరో పెళ్లి చేసుకోవడమనే వింత చూస్తాము. కానీ నిజ జీవితంలో ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా చూస్తాము. కర్ణాటకలోని కోలారు జిల్లా తాలూకాలోని వేగమడుగు గ్రామంలో ఇలాంటి వింట జరిగింది.
వివరాల్లోకి వెళ్తే కర్ణాటకలోని కోలారు జిల్లా తాలూకాలోని తిమ్మరావు హళ్ళి గ్రామ పంచాయితీ వేగమడుగు గ్రామానికి చెందిన రాణెమ్మ, నాగరాజప్ప రైతు దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో పెద్ద అమ్మాయి సుప్రియ చిన్న అమ్మాయి లలిత. అక్కకు చెల్లెలు అంటే ఎంతో ప్రేమ, కానీ తన చెల్లి లలితకు మూగ – బధిర దీనితో తన చెల్లిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అని అక్క సుప్రియ ఎప్పుడు భాదపడుతూ ఉండేది.
ఈ సమయంలోనే సుప్రియ కు పెళ్లి కుదిరింది. ఆ గ్రామానికి చెందిన ఉమాపతి అనే యువకుడితో సుప్రియ కు పెళ్లి నిశ్చయం అయింది. ఈనెల ఏడవ తేదీన పెళ్లి మండపం లో పెళ్ళికొడుకు తాళి కడుతుండగా సుప్రియ తన చెల్లిని కూడా నువ్వు పెళ్లి చేసుకుంటేనే నేను ఈ వివాహం చేసుకుంటానని వరుడికి ట్విస్ట్ ఇచ్చింది. చివరికి వరుడు ఉమాపతి పెద్దల అనుమతితో ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు.
అయితే ఈ వింత సంఘటనలో ఇంకో ట్విస్ట్ ఉంది, చివరికి పోలీసులు వచ్చి వరుడు తో సహా ఏడుగురిపై కేసు నమోదు చేశారు. ఎందుకంటె సుప్రియ చెల్లి లలితకు ఇంకా 18 ఏళ్లు నిండి లేదు. ఈ విషయం తెలియడంతో శిశు సంక్షేమ శాఖ పోలీస్ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియా లో ఇద్దరు భామల ముద్దుల మొగుడు అంటూ ఈ వార్త వైరల్ అవుతుంది.