తమిళనాడుకు చెందిన వడివేలు అనే వ్యక్తి కరోనా రాకుండా ఉండాలంటే పాము తినాలని చెబుతున్నాడు. ఆ విషయాన్ని చెప్పడమే కాదు ఏకంగా ఒక పామును పట్టుకొని కొరికి తినే ప్రయత్నం కూడా చేశాడు. ఈ సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ఆ సమయంలో అతను మద్యం సేవించడంతో ఈ ఘటన జరిగింది. అతను అదృష్టవశాత్తు పాము యొక్క విషపు గ్రంధులను కొరకలేదు, దీనితో అతనికి ప్రాణాపాయం తప్పింది. అయితే, ఇప్పుడు సోషల్ మీడియాలో అతను పాము ను తినే వీడియో వైరల్ గా మారింది. జనాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినందుకు పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

x