నాగార్జున నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో ‘సోగ్గాడే చిన్ని నాయన’ ఒకటి. ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఆయన ‘బంగార్రాజు’ టైటిల్ తో ఈ సినిమా సీక్వెల్ ను తెరకెక్కించబోతున్నారు. చిత్రబృందం ఈ నెల 20న సినిమాను లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే, సినిమా రెగ్యూలర్ షూటింగ్ ఆగష్టు 25 నుండి ప్రారంభం కానుంది.

ఈ సినిమాలో నాగచైతన్య ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘ఉప్పెన’ ఫేమ్ బ్యూటీ కృతి శెట్టి ఈ చిత్రంలో నాగచైతన్య తో రొమాన్స్ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం మూవీ మేకర్స్ హైదరాబాద్ లోని రెండు ప్రముఖ స్టూడియోస్ లో కొన్ని భారీ సెట్లను నిర్మించడంలో బిజీగా ఉన్నారు.

బంగార్రాజు మరణం తరువాత జరిగిన కథను ‘సోగ్గాడే చిన్నినాయన’ గా కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించారు. కానీ, ఈ సినిమా సెక్యూల్లో బంగార్రాజు మరణానికి ముందు జరిగిన కథను తెరకెక్కించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మనం మరికొన్ని రోజులు వేచి ఉండాలి.

x